Jana Nayagan: లీకుల కలకలం హ్యాకర్ల పనే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జననాయగన్’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకవైపు సెన్సార్ ఇబ్బందులతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు లీకుల బెడదతో ఈ సినిమా టీమ్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా పరిణామాలు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత గోప్యంగా జరిగే ఎడిటింగ్ రూమ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ నుండి ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దర్శకుడు హెచ్. వినోద్ సహా డైరక్షన్ టీం, ఎడిటర్ ప్రదీప్ వంటి వారిని విచారించగా, వారి నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదని తేలింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. సినిమా కాపీని భద్రపరిచిన గూగుల్ డ్రైవ్‌ను ఎవరో హ్యాక్ చేసి, ఫుటేజీని సర్క్యులేట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జగదీష్ నేతృత్వంలోని ‘ది రూట్’ టీమ్, యాంటీ పైరసీ బృందాలు ఈ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇక తమ అభిమాన నటుడి చివరి సినిమా ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై విజయ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినిమా కంటెంట్ బయటకు రావడం, మరోవైపు రిలీజ్ డేట్‌పై స్పష్టత లేకపోవడంతో ‘జననాయగన్’ టీమ్‌కు ఇది అత్యంత క్లిష్ట సమయమని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీకులకు కారకులైన వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ‘జననాయగన్’ వివాదం చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!