కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ది ఫస్ట్ రోడ్’ వీడియోకి మంచి స్పందన లభించింది. అందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ లుక్‌తో కనిపించి అభిమానుల్లో ఉత్సాహం రేపారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి విజయ్‌కు చివరి సినిమా కావచ్చని, అనంతరం ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటీ మమితా బైజు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..
Also read : Thug Life: 2025 లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ..
‘‘ ‘జన నాయగన్’ షూటింగ్ సమయంలో నేను ఆయనను అడిగాను. ఇది మీ చివరి సినిమా అంటున్నారు కదా? అని. దానికి విజయ్ సమాధానంగా ‘ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను, అది 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది’ అన్నారు. ఆ సందర్భం చాలా భావోద్వేగంగా ఉంది. షూటింగ్ చివరి రోజున విజయ్ కూడా ఎమోషనల్ అయ్యారు. అందుకే టీమ్‌తో ఫొటోలు కూడా దిగలేకపోయారు” అని తెలిపింది మమితా. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో. విజయ్ ఫ్యాన్స్ మళ్లీ సందిగ్థంలో పడిపోయారు. ఓ వైపు ఆనందంగాను మరో వైపు కన్‌ఫ్యూజన్‌గాను స్పందిస్తున్నారు. ఇక ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి మమితా ఎలాంటి వివరాలు చెప్పలేదు.