‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు వారికి దగ్గరైంది జాక్విలిన్. అయితే, హిందీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకోలేకపోయినా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ రేసులో కంటిన్యూ అవుతోంది. అయితే, ఈ 35 ఏళ్ల సీనియర్ సుందరి ముంబైలో సీరియస్ గానే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోంది. శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ముంబైలోని జుహూ ఏరియాలో ఇల్లు కొనేసింది. అంతే అయితే అది నిజంగా పెద్ద న్యూసేం కాదు. కానీ, కొత్త ఇంట్లో ఒంటిగా కాకుండా జంటగా కాలు మోపనుందట!
జాక్విలిన్ ఫెర్నాండెజ్ గత కొంత కాలంగా ఓ దక్షిణాది బిజినెస్ మ్యాన్ తో రొమాన్స్ నడుపుతోందని ముంబై టాక్. ఆయనతో కలసి ఇప్పుడు ఖరీదైన జుహూ ప్రాంతంలో సముద్రం వైపు తిరిగి ఉన్న ఓ బంగళ ఖరీదు చేసిందట.
అంతే కాదు, ఫ్రాన్స్ నుంచీ ప్రత్యేకంగా రానున్న ఇంటీరియర్ డిజైనర్స్ ఆమె ఇల్లుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారట! లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశాక డబ్బులు మొత్తం చెల్లించి పేపర్ వర్క్ పూర్తి చేస్తారని సమాచారం. ఆ తరువాత ఇంటీరియర్స్ పూర్తయ్యాక ఇంటిలోకి కాలుపెడతారట లవ్ బర్డ్స్! ఇంతకీ, జాక్విలిన్ మనసు దోచిన ఆ అల్ట్రా రిచ్ సౌత్ వ్యాపారి ఎవరు? ప్రస్తుతానికి సస్పెన్సే! కొత్త ఇంట్లోకి కాలు పెట్టాక జాక్విలిన్ తన రహస్య ప్రేమికుడ్ని ప్యాన్స్ కి పరిచయం చేస్తుందేమో…