టాలీవుడ్‌లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్‌లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే తాజాగా తేజ సజ్జ చేసిన ఒక పోస్ట్ ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది.
Also Read : Bigg Boss 9 : రెడీ అయిన బిగ్ బాస్ 9 హౌస్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి సామి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “కల్కి 2898 ఎడి” సినిమా నిర్మాత స్వప్న దత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తేజ సజ్జ “కే లో కలుద్దాం” అంటూ కామెంట్ చేశాడు. ఈ ఒక్క లైన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెట్టింట చర్చ మొదలైంది.. “తేజ సజ్జ కల్కి 2లో నటిస్తున్నాడా?” అని. “మిరాయ్” సినిమా స్వతంత్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ, కల్కి లాంటి సినిమాటిక్ యూనివర్స్‌కి ఆయన చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే నాగ అశ్విన్ రూపొందించిన కల్కి యూనివర్స్‌లో కొత్త క్యారెక్టర్లకి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. అదే తేజ సజ్జకి లభిస్తుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. “హనుమాన్” తర్వాత తన ప్రతిభను నిరూపించుకున్న తేజ సజ్జ, కల్కి 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం అయితే అది ఆయన కెరీర్‌కు గేమ్‌చేంజర్ అవుతుంది. కానీ ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. మొత్తానికి, తేజ సజ్జ పోస్ట్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సుకత పెరిగింది. నిజంగానే ఆయన “కల్కి 2”లో కనిపిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ అవుతుంది.