Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ముందుగా ఈ చిత్రాన్ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల చేయాలని భావించినా, అది సాధ్యం కాకపోవడంతో అధికారికంగా ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేశారు. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ తేదీ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలకు ఊతమిస్తూ, ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ తేదీలు మారిపోయాయి. మొదట మార్చి 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్, ఇప్పుడు ఏప్రిల్ 8వ తేదీకి వెళ్లింది. దీనికి కారణం సాంకేతిక కారణాలు అని చెబుతున్నప్పటికీ, సాధారణంగా పెద్ద సినిమాల బుకింగ్స్ ఇలా వెనక్కి వెళ్లాయంటే, సినిమా విడుదల తేదీలో కూడా మార్పు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
ప్రస్తుత ఉన్న సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉండటం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టేలా ఉండటంతో, సినిమాను మే 21, 2026కి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, మూడు వారాలు వెనక్కి వెళ్లనుందన్నమాట. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఏప్రిల్ 30 నాటికే సినిమాను సిద్ధం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఒకవేళ పనులు పూర్తి కాకపోతే మే నెలకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే, మరోవైపు రామ్ చరణ్ మాత్రం కంటి గాయమైన కూడా షూటింగ్ సకాలంలో పూర్తి చేయాలనే పట్టుదలతో, విరామం తీసుకోకుండా తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బుచ్చిబాబు కూడా ఎట్టిపరిస్థితుల్లోను ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాడు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ప్రస్తుతానికి పెద్ది వాయిదా లేనట్టే!
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?