Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా రామ్ చరణ్ షూటింగ్‌లో గాయపడ్డారు. కంటి సమీపంలో చిన్న గాయం అవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని పెద్ది టీమ్ తెలిపింది. ఆయన తిరిగి సెట్స్‌లో కూడా పాల్గొనబోతున్నారని తెలిపారు. అయితే, చరణ్‌కు గాయం కారణంగా ‘పెద్ది’ నుంచి రావాల్సి అప్డేట్స్ రావేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అలాంటిదేమి ఉండదని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న పెద్ది మాస్ ర్యాంపేజ్ చూస్తారని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
Also Read: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
Also Read
- SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
- December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
- Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
మార్చి 27 ఉదయం 11:07 గంటలకు పెద్ది టీజర్ రిలీజ్ కానుంది. ఇక ఈ టీజర్ కుస్తీ పేరుతో రాబోతోంది. గతంలో ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా క్రికెట్‌కు సంబంధించిన షాట్స్ రివీల్ చేశారు. ఇప్పుడు రాబోయె టీజర్‌లో ‘కుస్తీ’కి సంబంధించిన షాట్స్ రివీల్ చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నట్టుగా మొదటి నుంచి టాక్ ఉంది. క్రికెట్‌తో పాటు కుస్తీకి సంబంధించిన కీలక సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించిన షాట్స్ వచ్చేశాయి కాబట్టి, ఇప్పుడు కుస్తీ పోరుకు సిద్ధమవుతున్నాడు పెద్ది. ఈ టీజర్ వచ్చాక సినిమా కథతో పాటు రామ్ చరణ్ మాస్ రోల్ పై మరింత క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Your feed will be PEDDIfied from 11.07 AM on March 27th ❤🔥❤🔥
Stay tuned for the MASS RAMPAGE💥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/WxiXvgAwfQ
— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026
తాజావార్తలు
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!