Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి టైటిల్‌తో పాటు కథలోని ప్రత్యేకతలపై తాజాగా చిత్ర బృందంతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథ ప్రాథమికంగా మూడు లేయర్లలో సాగుతుందని తెలిపారు. టైటిల్‌కు కూడా కథలోని ఈ మూడు లేయర్స్‌కి సంబంధం ఉందని చెప్పారు. అయ్యప్ప స్వామికి, ఆయనను కొలిచే భక్తుడికి మధ్య ఉండే అనుబంధం ఒక లేయర్ కాగా.. తండ్రి, కుమార్తె మధ్య ఉన్న బంధం మరో ముఖ్యమైన అంశమని వివరించారమన్నారు. ఇక మూడో లేయర్‌గా సినిమాలోని సస్పెన్స్, చిన్న క్రైమ్ యాంగిల్, ఊహించని ప్రపంచం ఉంటుందని శివ నిర్వాణ వెల్లడించారు. సాధారణంగా ఒక చిక్కుముడిని ‘ముడి’ అని అంటామని, కథలోని అన్ని అంశాలను కలిపే ఆ ముడి ఆధారంగానే ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలిపారు.
‘‘ఎమోషన్‌తో పాటు ఫియర్, టెన్షన్‌ను మిళితం చేసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించాలనుకున్నాం. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు. రవితేజ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే కొన్ని సన్నివేశాలను రూపొందించినట్లు కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా ‘ఇరుముడి’ పాటలో రవితేజను చూసినప్పుడు సామాన్య ప్రేక్షకులకు తమ కుటుంబంలోని వ్యక్తిని చూసిన భావన కలగాలని అనుకున్నామని చెప్పారు. రవితేజ కెరీర్లో ‘సింధూరం’ నుంచి ఇప్పటివరకు ఆయనతో కనెక్ట్ కాని కుటుంబాలు, మహిళలు, పిల్లలు చాలా తక్కువేనని పేర్కొన్నారు. గ్రామాల్లో సాధారణంగా రిక్షా కార్మికుడు, ఆటో డ్రైవర్, మధ్యతరగతి వ్యక్తి.. ఇలా అన్ని వర్గాల వారు అయ్యప్ప మాల ధరించి భక్తితో కనిపిస్తారని, అదే సహజత్వం రవితేజ పాత్రలోనూ కనిపించాలని భావించినట్లు తెలిపారు. ‘ఇరుముడి’లో రవితేజను చూసినప్పుడు ప్రేక్షకులకు ‘‘మా నాన్న, మా బాబాయి, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు’’ అనే అనుభూతి కలగాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలతో పాటు ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్‌తో ‘ఇరుముడి’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. అలాగే నిర్మాత మైత్రీ రవి మాట్లాడుతూ.. ఈ కథను మొదట విన్నప్పుడే ఇందులోని అయ్యప్ప బ్యాక్‌డ్రాప్, కథలోని విభిన్న షేడ్స్ తమకు బాగా నచ్చాయని చెప్పారు. ఈ కథకు రవితేజ మాత్రమే సరైన హీరో అని తాము బలంగా నమ్మినట్లు వెల్లడించారు. ‘‘ఎమోషనల్ యాంగిల్, ఇంటెన్స్ ఫైట్, యాక్షన్, కొంత ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నీ కలిసిన కథ ఇది. ఇందులోని న్యాచురల్ ఎమోషన్స్‌కు రవితేజ అయితేనే న్యాయం చేయగలరని దర్శకుడితో పాటు మేమంతా బలంగా నమ్మాం. కథ చెప్పగానే రవన్నకు కూడా నచ్చింది’’ అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
- Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
- Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
- Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
-
US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!