Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు. అసలు స్టార్ హీరోలు ఇలాంటి నెగెటివ్ షేడ్స్ వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు? తెరపై హీరోలను మించి వీరు సృష్టిస్తున్న సంచలనమేంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ పాన్-వరల్డ్ అడ్వెంచర్ ‘వారణాసి’. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. దానికి దీటుగా ఉండే విలన్ పాత్రపై అంతకుమించిన ఆసక్తి నెలకొంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. “నీలోని కుంభను తట్టి లేపానని నేను అనుకోవడం లేదు.. ప్రపంచంపై తనదైన ముద్ర వేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఆ కుంభ” అంటూ జక్కన్న ఇచ్చిన హింట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికెత్తేసింది. కేవలం కండబలంతో కొట్టుకునే సాధారణ విలన్ కాదిది.. తన ఆలోచనలు, ఎత్తులు పైఎత్తులతో హీరో ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేసే అత్యంత ప్రమాదకరమైన మైండ్ గేమర్గా ‘కుంభ’ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
విలన్ అంటే కేవలం హీరో చేతిలో దెబ్బలు తినేవాడు కాదు.. కథ మొత్తాన్ని తన గుప్పెట్లో శాసించేవాడు అని చాటిచెప్పిన పాత్ర ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ పోషించిన ‘సుప్రీమ్ యాస్కిన్’. సినిమాలో కొద్ది నిమిషాలే కనిపించినప్పటికీ.. ఆ వణుకు పుట్టించే లుక్, గంభీరమైన కళ్లు, మాటతీరుతో కమల్ థియేటర్లలో తీవ్ర భయాన్ని రేకెత్తించారు. ఇప్పటివరకు మనం చూసింది శాంపిల్ మాత్రమేనని, ‘కల్కి 2’లో యాస్కిన్ అసలు విశ్వరూపం చూడబోతున్నామని చిత్రబృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది. ఇక ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున సైతం తన సేఫ్ జోన్‌ను బద్దలు కొట్టారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ లీడర్ ‘సైమన్’గా నాగార్జున చూపించిన స్టైలిష్ విలనిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆయన చూపించిన స్వాగ్, ఆటిట్యూడ్ వెండితెరకు సరికొత్త కలర్ తెచ్చాయి. హీరో ఎంత గొప్పవాడైనా, అతడిని సవాలు చేసే ప్రతినాయకుడు మరింత రాక్షసంగా, తెలివైనవాడిగా ఉంటేనే బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారుతుంది. అందుకే నేటితరం అగ్ర నటులు తమ స్టార్ ఇమేజ్ చట్రాలను బద్దలు కొట్టి మరీ ప్రతినాయక పాత్రల కోసం పోటీ పడుతున్నారు. రాబోయే కాలంలో వెండితెరను శాసించేది, బాక్సాఫీస్ వసూళ్లను నడిపించేది హీరోల కంటే ఈ రాక్షస విలన్లే అనడంలో సందేహం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
- Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
తాజావార్తలు
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!