ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చర్చనీయాంశము అయ్యింది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ ఉదయం ట్రైలర్‌ను విడుదల చేశారు. “‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” అనే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్-సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. జూన్ 18న ఆహాలో విడుదల అవుతుంది. సురేష్ కృష్ణ సర్ అండ్ టీంకు శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రియదర్శి ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. స్వేచ్ఛ, ప్రేమ, దురాశ, కామం, అందం మొదలగు అంశాలను ఈ వెబ్ సిరీస్ లో ఉండనున్నట్లు చూపించారు. ప్రియదర్శి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి హాట్ గా ఉన్న ఈ ట్రైలర్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ విడుదలపై ఆతృత పెంచేసింది ట్రైలర్. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.