బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. ప్రస్తుతం షారుక్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల షారుక్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన కింగ్ టీజర్ కు భారీ స్పందన లభించింది.
Also Read : RT 76 : రవితేజ – కిషోర్ తిరుమల.. టైటిల్ ఇదే
బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు స్పెషలిస్ట్ గా పేరొందిన సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను రెడ్ చిల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ ఫై తెరకెక్కిస్తున్నాడట షారుక్. వినిపిస్తున్న సమాచారం ప్రకారం కింగ్ కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. కింగ్ సినిమాను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కిస్తున్నాడు సిద్దార్ధ్ ఆనంద్. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ ను రప్పించి మరి షూట్ చేస్తున్నారు. షారుక్ – సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన పఠాన్ బాలీవుడ్ హిస్టరీ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న కింగ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.