అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sankranthiki Vastunnam: అల వైకుంఠపురంలో రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం
నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర తెలుగు టైలర్ లాంచ్ చేయడం జరిగింది. నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 సంవత్సరాల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అంటూ ముగించారు.