అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కుష్బూ. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో తన సత్తా చాటిన కుష్బూ, గత కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా వివిధ రంగాల్లో సత్తా చాటుతుంది. అయితే ఖుష్బూ కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా మారనున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తన దగ్గరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ ఇంకా దేన్నీ ఫైనల్ చేసి సైన్ చేయలేదని అవంతిక చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంటే ఆమె తల్లి ఏం అన్నరో కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..
Also Read: Sreeleela: ‘అది దా సర్‌ప్రైజ్’.. స్టెప్ పై శ్రీలీల కామెంట్స్
‘ నా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎంతో అందమైన వారిని చూస్తూ పెరగాను. సినిమాల్లో నటించేంత టాలెంట్, అందం నా దగ్గర లేవనుకునేదాన్ని. మా అమ్మ చేసిన ఎన్నో సినిమాలు నేను పుట్టకముందే వచ్చాయి. రమ్ బమ్ బమ్ మూవీ చూసి ఆమె చాలా గ్రేట్ అనిపించింది. తండ్రి సుందర్ సినిమాలు నాకెంతో ఎంటర్టైనింగ్‌గా అనిపిస్తాయి. ఇన్నేళ్లుగా నా తల్లిదండ్రులు ఇచ్చిన సలహాలు, సూచనలు అన్నీ నా కోసం, తన కెరీర్ మంచి కోసమే. వారు ఏ విషయంలోనూ ఎప్పుడూ నన్ను ఒత్తిడికి గురి చేయలేదు. అలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడై అమ్మకి చెప్పినప్పుడు తానెంతో సపోర్ట్ చేసింది. కానీ సినీ ఇండస్ట్రీలో నిలదోక్కుకోవడం అనుకున్నంత ఈజీ కాదని తెలిపింది. అక్కడ చాలా హార్ష్‌గా ఉంటుందని, అందరూ నెపోటిజం గురించి మాట్లాడతారని, అలాంటప్పుడు వారి మాటలను తిరస్కరించలేనని అమ్మ నాతో అన్నింది. నా తల్లి చెప్పిన మాటల్ని విన్న తర్వాత అన్నింటికీ రెడీగా ఉండాలని డిసైడయ్యా. ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది.ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాను, నేను చేసే పాత్రలే ఆడియన్స్‌కు నన్ను చేరువ చేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అని అవంతిక తెలిపింది.