ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్‌లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ టీజర్ వచ్చింది.
Also Read:Peddi : ‘పెద్ది’ క్రేజ్ మ్యాటర్స్.. అంతకు మించి!
ఆ టీజర్‌తో పాటు గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమాకి సంబంధించిన బైక్ రైడింగ్ క్లిప్‌తో పాటు మిర్చి సినిమాకి సంబంధించిన మరో క్లిప్ ఆడ్ చేసి, బైక్ లేదా కార్ల మీద స్పీడింగ్ వద్దని, నిదానమే ప్రధానమని అర్థం వచ్చేలా ఒక వీడియో కట్ చేశారు. “హలో హలో, బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్” అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగ్ అయితే హైలైట్ అవుతోంది. అలాగే, కచ్చితంగా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని కూడా పోలీసులు చెబుతున్నారు.
Also Read:Akhil: అయ్యగారు ‘పరువు’ నిలబెడతారా?
మొత్తం మీద ఈ వీడియో అయితే వైరల్ అవుతోంది. ఈ వీడియోకి డైరెక్టర్ మారుతి కూడా స్పందించాడు. “ఎస్సార్ పర్ఫెక్ట్, మా ఫుటేజ్ పాజిటివ్‌గా వాడుకున్నందుకు థాంక్స్” అని చెప్పాడు. కొంతమంది నెటిజన్లు అయితే “అబ్బా, ఏం వాడకం రా అయ్యా” అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.