మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.ఈ సినిమాని ముందుగా తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత మారుతి తన స్నేహితుడు ఎస్కేఎన్ తో కలిసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో లవర్ గా తెలుగులో ట్రూ లవర్ గా ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read; Holiday on 8th February: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..!
రీసెంట్ గా “ట్రూ లవర్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఈ సినిమా మీద ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. “ట్రూ లవర్” సినిమా చూసిన అక్కడి కొందరు సెలబ్రిటీలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇదొక గుడ్ ఫిలింగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో “ట్రూ లవర్” సినిమా మీద చర్చ జరుగుతోంది. తెలుగులోనూ సినిమా మీద ఆ బజ్ క్రియేట్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 9న “ట్రూ లవర్” సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
నటీనటులు – మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు