AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అషురెడ్డి పెళ్లి పేరుతో తన రూ. 9.5 కోట్లు డబ్బు తీసుకుని మోసం చేసిందని ఎన్నారై ధర్మేంద్ర కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తనపై లేనిపోని అభియోగాలు చేస్తున్నారని హై కోర్టు లో ఆశు రెడ్డి పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. మీడియాలో తన గురించి కథనాలు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరింది. ఇంజెక్షన్ ఆర్డర్ కోసం మళ్ళీ హై కోర్టును ఆశ్రయించడంతో అషురెడ్డి సివిల్ కోర్టు లో మెరిట్స్ పై విచారణ జరిగే వరకు ఆమె పరువు కు భంగం కలిగించే కథనాలు వద్దని హై కోర్టు వెల్లడించింది.
అయితే తనపై నమోదైన కేసులో దర్యాప్తును నిలిపివేయాలని మరో పిటిషన్‌ను దాఖలు చేసింది అషురెడ్డి. ఒక ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో నగదు మరియు విలువైన బహుమతులు తీసుకుని మోసం చేశారని అషురెడ్డి మరియు ఆమె తల్లి యశోదరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో తమపై దర్యాప్తును నిలిపివేయాలని కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ దశలో దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా పోలీసుల విచారణ సజావుగా సాగాలని తెలిపింది. దాంతో పాటు కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అషురెడ్డి అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో పోలీసులు చట్టప్రకారం తమ దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని కోర్టు అభిప్రాయపడింది. చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సిందేనని స్పష్టం చేయడంతో అషురెడ్డి ఆమె తల్లి ఇప్పుడు పోలీసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అషురెడ్డికి పెద్ద ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని దోషిగా తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
తాజావార్తలు
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Story Board : రాజీనామాలతో చేసిన తప్పు సరైపోతుందా..?
-
Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!