Dasara Shooting: టాలీవుడ్ లో తనదైన గుర్తింపు దర్కించుకుని నేచురల్ స్టార్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఒకవైపు సినిమాల్లో హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే సినీ ఇండస్ర్టీలో ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది. అదే మన నేచురల్ స్టార్ నానికి ప్రమాదం జరిగిందని, అయితే ఆ ప్రమాదం నుంచి నాని బయట పడ్డారని, దీంతో ఆయన కొద్దిరోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పారని టాక్.
హీరో నాని షూటింగ్ లో ఎంత అలర్ట్ గా వుంటారో అంతే నవ్వులు పూయిస్తూ అందరిని ఆకట్టుకుంటుంటారు. అందరిని కలుపుకునే మనస్తత్వం నానిది. అయితే.. నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దసరా. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వహిస్తున్నా, ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. దసరా సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ షూటింగ్ హీరో నానితో షూటింగ్ నిర్వహిస్తు్ండగా.. ట్రక్ నుంచి బొగ్గు నానిపై పడిందట. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాకైంది. అయితే నాని హీరోకి పెద్దగా గాయాలేమీ కాకపోవటంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుందట. కాస్త గాయాలైన నాని కాస్త షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం. మళ్లీ షూటింగ్ కు కాస్త ఓకే కాగానే స్టార్ట్ అవుతుందని చిత్రయూనిట్‌లో టాక్ వినిపిస్తోంది.
రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో హీరో నాని గుబురు గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్‌తో కనిపించనున్నాడు. ఎస్‌ఎల్‌వీ సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చురుకూరి నిర్మిస్తున్నా దరసరా ఈ ఏడాదిలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. హీరో నానికి అంటే సుందరానికి మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేక పోయిన అంతకన్న ముందే 2021 డిసెంబర్ లోవిడుదలైన సినిమా శ్యామ్ సింగరాయ్ మంచి పేరునే తీసుకొచ్చింది. దీంతో నాని తన హోప్స్ని దసరా సినిమాపై పెట్టుకోవడమే కాకుండా లుక్ పరంగా సరికొత్తగా ట్రై చేస్తున్నాడు నాని. అయితే.. పక్కా లోకల్ నేపధ్యం ఉన్న సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతూ ఉండడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందని నాని అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.