నూతన డైరెక్టర్ బలరాజు ఎం దర్శకత్వంలో సుక్రాంత్ వీరెల్లా కథానాయకుడుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “కనబడుటలేదు”. సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… వైశాలిరాజ్, హిమజ, ఉగ్రన్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచెరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Read Also : అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో… ‘అర్జున్ రెడ్డి’!
తప్పిపోయిన ఒకరి పోస్టర్ ను చూస్తూ ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తితో టీజర్ ప్రారంభమవుతుంది. తల లేని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభిస్తారు. సునీల్ చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించాడు. టీజర్ లో సినిమాలోని ప్రధాన పాత్రధారుల రెండు ముఖాలను అంటే మంచి చెడులను చూపించారు దర్శకుడు. టీజర్ చివర్లో ముసుగు ధరించిన వ్యక్తి తలక్రిందులుగా వేలాడడం ఆసక్తిని పెంచేస్తోంది. అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు ? చంపింది ఎవరు ? ఆ ముసుగు మనిషి ఎవరో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ థ్రిల్లర్ మూవీ త్వరలో స్పార్క్ OTT లో విడుదల కానుంది. ఉత్కంఠభరితంగా ఉన్న “కనబడుటలేదు” టీజర్ ను మీరు కూడా వీక్షించండి.