అందం, టాలెంట్ రెండు ఉన్న హీరోయిన్స్ దొరకడం చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు. ‘కుమారి 21F’ మూవీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయమై, తొలి సినిమాతోనే అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది హెబ్బా. తన క్యూట్ నెస్‌ను చూసి భవిష్యత్తులో చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని అనుకున్నారు కానీ, కనీసం మీడియం రేంజ్ హీరోయిన్‌గా కూడా అవ్వలేకపోయింది. ఇప్పటికీ ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉన్న, ఏ ఒక్క మూవీ కూడా ఆమెను టాప్ రేంజ్‌కు తిసుకెళ్ళలేకపొయ్యాయి. కానీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ ఆమె కెరీర్‌కు మంచి ప్లేస్ అయ్యింది.
Also Read: Tollywood : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్?
ఈ మూవీ కరోనా లాక్ డౌన్ సమయం రావడంతో ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయ్యింది. అయినప్పటికి అప్పట్లో ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2′ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హెబ్బా ఈ మూవీలోని తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. ‘ ‘ఓదెల 2′ లో నాకు తమన్నా గారి కాంబినేషన్ ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో తమన్నా నాకు అక్క పాత్రలో కనిపించనుంది.ఈ మూవీలో ఎక్కువ శాతం నేను జైలు సన్నివేశాల్లో కనిపిస్తాను. మొదటి భాగంలో నా క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ ఇంప్యాక్ట్‌ని చూపించిందో, ‘ఓదెల 2’ లో కూడా అదే రేంజ్ ఇంప్యాక్ట్ చూపిస్తుంది. మొదటి భాగం కంటే ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ.