Harilo Ranga Hari: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘హరిలో రంగ హరి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలను మేళవిస్తూ తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘హరిలో రంగ హరి’. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టతలను, మనుషుల మధ్య ఉండే అనుబంధాలను ఆవిష్కరిస్తోంది. కథ ప్రధానంగా గ్రామీణ కుటుంబంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఒక సోదరుడికి, అతడి వదినకు మధ్య ఉండే బంధం, అపార్థాలు, కుటుంబం కోసం చేసే త్యాగాలను భావోద్వేగభరితంగా డైరెక్టర్ చూపించారు.
హర్షిణి పిక్చర్స్ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్ హరిలో రంగ హరి షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు. హరీష్ నూకాలా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా.. శతానంద ఈ కథను అందించారు. ప్రవీణ్ తోట, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. వనిషా నాయక్, సముద్రాల, హరీష్ నల్లాని, శ్రీశైలం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి నితిన్ హెచ్ సంగీతం సమకూర్చారు. ఇటీవల హర్షిణి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇదే బ్యానర్‌పై రూపొందిన ‘హరిలో రంగ హరి’ షార్ట్ ఫిల్మ్ కూడా ట్రెండింగ్ అవుతోంది.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
హరిలో రంగ హరి, ప్రేమాయణం ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో నిర్మాణ సంస్థ హర్షిణి పిక్చర్స్ బ్యానర్లో ఉత్సాహం నెలకొంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ ప్రాజెక్టులను నిర్మాణ సంస్థ రూపొందించింది. చిన్న బడ్జెట్ నిర్మాణాల ద్వారా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ నిలుస్తోంది.
తాజావార్తలు
-
Harilo Ranga Hari: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘హరిలో రంగ హరి’!
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!