పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. జూలై 24 న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాగా.. రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర నిర్మాత AM రత్నం తెలిపారు.
Also Read : Sreeleela : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..
తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “జూలై 24న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అయితే ముందే ఓ స్పెషల్ సర్ప్రైజ్‌గా జూలై 23 రాత్రి 9, 9.30కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశాం” అని వెల్లడించారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఈ ప్రీమియర్లు విడుదలకు ముందే సినిమా బజ్‌ను మరింత పెంచేలా ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ అప్డేట్ విని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను వీరమల్లు అనే పవర్‌ఫుల్ యోధుడిగా చూపించనుండగా. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏ.ఎం. రత్నం ప్రకటించారు. మొదటి భాగానికి హరిహర వీరమల్లు: Part 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, అనుపమ్‌ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.