Site icon NTV Telugu

Pawan Kalyan : లక్షలాది మంది మధ్య జరుపుకుందాం అనుకుంటే కుదరలేదు !

Pawan Kalyan Hhvm Event

Pawan Kalyan Hhvm Event

హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాని ఆదరించి ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, శిల్పకళా వేదిక నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ హైదరాబాద్, తెలంగాణలో కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందాం అని ప్లాన్ చేసినా, వర్షాభావాలు, ఇతర కారణాలవల్ల ముందుకు తీసుకెళ్లలేక ఫంక్షన్ సైజుని శిల్పకళా వేదికకు పరిమితం చేశాము. ప్రతి ఒక్కరూ టీవీలో కూర్చుని మరింత సురక్షితంగా చూడాలని ఉద్దేశం. ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు.

Also Read : HHVM : పవన్ కల్యాణ్‌ ఎవరి దారిలో నడవడు.. బ్రహ్మానందం కామెంట్స్

తెలంగాణ డిజిపి, సైబరాబాద్ కమిషనర్‌కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బోనాల పండుగ సమయంలో ఒత్తిడికి గురవకూడదు, తొక్కిసలాట జరగకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్‌కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రావాల్సింది కానీ సీఎం గారి రివ్యూ మీటింగ్‌లో ఉండి రాలేకపోయారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. పాలిటిక్స్‌కి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి మిత్రుని సంపాదించుకున్నాను, అది శ్రీ ఈశ్వర్ అంటూ కర్ణాటక మంత్రి గురించి ప్రస్తావించారు. అలాగే, కందుల దుర్గేష్ గారు, రఘురామ కృష్ణంరాజు గారు విచ్చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.”

Exit mobile version