పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 3న అంటే ఈ రోజు ఉదయం 11:10 గంటలకు గ్రాండ్ లాంచ్‌కు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ప్రత్యేకంగా ట్రైలర్ స్క్రీనింగ్‌ను ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్‌లో జరగాల్సిన ట్రైలర్ స్క్రీనింగ్‌ను భద్రతా కారణాల వల్ల రద్దు చేశారు. జూలై 2న ఉదయం ఎంట్రీ పాస్‌ల కోసం భారీగా తరలివచ్చిన అభిమానుల వల్ల పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు ఎక్కువ శ్రమ పెట్టాల్సి వచ్చింది.
Also Read : Deepika Padukone : హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో దీపికా పేరు.. తొలి భారతీయ నటిగా చరిత్ర!
ఈ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం, పోలీసులు ముందస్తు నిర్ణయం తీసుకొని స్క్రీనింగ్‌ను క్యాన్సిల్ చేశారు. ఇటీవలే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ కోసం గుమిగూడిన అభిమానుల వల్ల ఏర్పడిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండదని ఈ నిర్ణయం తిసుకున్నారు. అయితే ఇది హైదరాబాద్‌లోని ఇతర థియేటర్లపై ప్రభావం చూపలేదు. అక్కడ ట్రైలర్ స్క్రీనింగ్ యథాతథంగా జరుగుతుంది. అలాగే, హరి హర వీర మల్లు ట్రైలర్‌ను యూట్యూబ్‌లో కూడా విడుదల చేయనున్నారు. కాగా ఈ ట్రైలర్ దాదాపు 3 నిమిషాల 1 సెకన్ నిడివితో ఉండనుందని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎలివేషన్ సీన్లు, పొలిటికల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఫైనల్ కట్‌ను స్వయంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి వీక్షించి, దర్శకుడిని అభినందించినట్లు సమాచారం. ఇక పవన్ అభిమానుల్లో భారీ క్రేజ్‌ను ఏర్పరిచిన ఈ చిత్రం ట్రైలర్ ద్వారా మరింత హైప్ తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు.