బాలీవుడ్‌లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో అరంగేట్రం చేసిన దీపికా పదుకొణె నటిగా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె నటనకు గ్లామర్‌ను జోడిస్తూ వరుస విజయాలతో సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలకే కాదు, ఆమె గ్లోబల్ లెవల్లో గుర్తింపు పొందుతూ హాలీవుడ్‌లో కూడా తన ప్రతిభను చాటారు.
Also Read : Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్
ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరొక అరుదైన గౌరవం లభించింది. దీపికా పదుకొణెకు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమెను హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంపిక చేయడం విశేషం. దీపికా పేరు హాలీవుడ్ బులేవార్డ్‌పై ఏర్పాటు చేయనున్న స్టార్ ప్లేట్‌పై కనిపించనుంది. ఇది ఒక ప్రముఖ గుర్తింపు మాత్రమే కాకుండా, ప్రపంచ సినీ రంగంలో భారతీయ నటీనటుల ప్రతిభను గుర్తించిన చారిత్రాత్మక ఘట్టం. ఇంతవరకూ బాలీవుడ్ నుంచి అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి నటులు కూడా ఈ జాబితాలో స్థానం పొందలేదు. అయితే దీపిక మాత్రం ఆ ఘనతను సాధించి, తొలిసారిగా ఈ గౌరవాన్ని అందుకున్న భారతీయ నటిగా రికార్డ్ సృష్టించారు.
హాలీవుడ్ మూవీ xXx: Return of Xander Cage ద్వారా ఆమెకు అక్కడి ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు, మెటా గాలా, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల్లో ఆమె ఎప్పటికప్పుడు కనిపిస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్నారు. 2026 లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో దీపికా పేరుతో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీపికా పదుకొణెకు ఈ గౌరవం లభించడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాదు, దేశానికి కూడా గర్వకారణమే.