Hanuman Creates a record by fetching a profit of 100 crores plus on theatrical business: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి కూడా మంచి పాజిటివ్ స్పందన వస్తుంది. హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Manikandan: మెగాస్టార్ సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్న తమిళ్ హీరో.. స్వయంగా డబ్బింగ్!
ఈ సినిమా ఇప్పటికే 3 వారాలు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మంచి పాజిటివ్ బజ్ రావడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులలోనే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఇక గత వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్ లు కూడా లేకపోవడంతో హనుమాన్ మూవీ త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఒక సరికొత్త ఫీట్ సాధించినట్టు తెలుస్తోంది. అదేంటంటే సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగిన తరువాత కేవలం తెలుగు రాష్ట్రాల థియేటర్ల నుంచే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నాలుగవ సినిమాగా, నాన్ రాజమౌళి సినిమాల్లో మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మాత్రమే ఆ లిస్టులో ఉండేవి. కానీ ఇప్పుడు హనుమాన్ కూడా ఆ లిస్టులో చేరింది.