కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ లాంచ్ చేశారు.
Also Read : Bandi Sanjay : సంజయ్ చొరవ.. రంగంలోకి వైమానిక దళ హెలికాప్టర్
చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే… ఒక మొహమాటస్తుడైన వ్యక్తి తన మొహమాటంతో తన ఉద్యోగాన్ని అలాగే తన జీవితంలో ఇతర సన్నివేశాలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, తన జీవితంలోకి వచ్చిన తనపై అధికారితో ఎలా మెసులుకుంటాడు అనేది తెలుపుతూ ఎంతో ఫన్నీగా ఉంది. అలాగే అతని క్యారటైజేషన్ చూస్తే సహజంగా మనం బయట చూసే ఎంతోమందిని ప్రతిబింబెస్తూ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.