బాలీవుడ్‌లో తనదైన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ పాత్రలకు పేరుగాంచిన గుల్షన్ దేవయ్య.. ఇటీవల బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ సెకండ్ పార్ట్ (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)లో విలన్ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ భాగమవడం అతనికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.
Also Read:Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
గుల్షన్ దేవయ్య.. ఎట్టకేలకు ఇప్పుడు టాలీవుడ్‌లోకి ప్రవేశించబోతున్నాడు. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకునే గుల్షన్.. టాలీవుడ్‌లో తన మొదటి ప్రాజెక్ట్‌గా సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పేరు ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య.. సమంత సరసన ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను సమంతతో నటించడానికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, గుల్షన్ దేవయ్య టాలీవుడ్ ప్రయాణానికి మంచి ఆరంభాన్నిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.