బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా పది రోజులు మహా అయితే టూ వీక్స్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనస్సు గట్టిగా గెలుచుకున్నట్టే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో రెండు సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ఫ్రూవ్ చేసాయి గుజరాతీ సినిమాలు.
Also Read : Raja Saab : ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన మారుతీ
ఈ మధ్య కాలంలో మంచి మంచి కంటెంట్ సినిమాలిస్తూ లోకల్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టేడమే కాదు బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ చర్చించుకునేలా చేస్తున్నాయి గుజరాతీ ఫిల్మ్స్. అక్టోబర్ నెలలో రిలీజైన రెండు సినిమాలు లాలో కృష్ణ సదా సహాయతే పాటు చనియా టోలీ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. రూ. 50 లక్షలతో తెరకెక్కించిన లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పటి వరకు రూ. 75 కోట్లను వసూలు చేసి హయ్యెస్ట్ గ్రాసర్ గుజరాతి ఫిల్మ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. లాలో మూవీ కన్నా జస్ట్ 11 రోజుల తర్వాత విడుదలైన చనియా టోలీ కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. నెల రోజుల్లో సుమారు రూ. 25 కోట్లు రాబట్టుకొన్న కామెడీ డ్రామా ఫిల్మ్ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. చనియా టోలీ గుజరాతీ ఇండస్ట్రీలో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అలాగే ఈ మధ్యే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వశ్ లెవల్2 సుమారు రూ. 16 నుండి రూ. 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అంతేకాదు.. ఈ సినిమాను రూ. 3.5 కోట్లకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఏ గుజరాతీ సినిమాకు ఇలాంటి అవకాశం దక్కలేదు. ఓపెనింగ్స్, భారీ వసూళ్లతో గుజరాతి సినిమాలు సంథింగ్ డిఫరెంట్ అని ప్రూఫ్ చేస్తున్నాయి.