మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ టీజర్ మరియు పాటలతో రిలీజ్ చేయగ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి, ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Sobhita Dhulipalla : ‘సమంత’ను అలా చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
దేశవ్యాప్తంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాలను వెల్లడిస్తూ, ఒక ఉగ్రవాది వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గోపీచంద్ సరిహద్దులో ఉన్న అంకితమైన జవాన్‌గా పరిచయం చేయబడ్డాడు. కథ రివీల్ చేస్తూ, ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, హాస్యనటుల పాత్రల పరిచయంతో టోన్ సీరియస్ మూడ్ నుండి హాస్యభరితంగా మారింది. గోపీచంద్ తన పాత్రలో రెండు విభిన్నమైన వేరియేషన్స్‌ని చూపించాడు. అతను జవాన్‌గా మాకో మరియు ఇంటెన్స్‌గా కనిపించినప్పటికీ, నరేష్ అండ్ కోతో ఎపిసోడ్‌లలో హాస్యభరితంగా ఉన్నాడు.గోపీచంద్ స్టైలిష్ మేకోవర్ లో కనిపించాడు. “నేను ఏడియానా ప్రాబ్లమ్ కి కనెక్ట్ అయితే, చివరి దాక నిలబడటం నా బలహీనతా” అనే డైలాగ్ ఆకట్టుకుంది. కావ్య థాపర్ గ్లామరస్ అవతార్‌లో కనిపించింది మరియు ట్రైలర్ కూడా వారి ప్రేమ కథను చూపించాడు.
Also Read : Myth Breaker NTR : నాకు ఇష్టం లేదు.. కానీ నచ్చింది..
వెంకీ సినెమాలోలా వెన్నెల కిషోర్, నరేష్ మధ్య రైలు ఎపిసోడ్‌లో మెరిసింది. వీటీవీ గణేష్, నరేష్, ప్రగతి, పృథ్వీ, సునీల్, రాహుల్ రామకృష్ణ తదితరులు తమతమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చైతన్ భరద్వాజ్ నేపథ్యం అద్భుతంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు చిత్రాలయం స్టూడియోస్ యొక్క గొప్ప నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విశ్వం విడుదల కానుంది.