దేవర ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవర సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయింది. కేవలం బయ్యర్స్ తో పాటు అతికొద్ది మంది సన్నిహతుల మధ్య ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు.
Also Read : Devara : ఏపీ – తెలంగాణ 9వ రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ కుమ్మింగ్స్..
ఈ నేపథ్యంలో అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తారక్ దేవర పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో యంగ్ టైగర్ యమా బిజీగా ఉన్నాడు. వచ్చిరాగానే సక్సెస్ మీట్ నిర్వహించాడు. ఇప్పుడు సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. తాజగా ఈ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. కాగా సుమ, తారక్, కొరటాల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. దేవర సక్సెస్ తో రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత సినిమా ప్లాప్ అవుతుంది అనే ఓక సెంటిమెంట్ ను యంగ్ టైగర్ బద్దలు కొట్టాడు. దీంతో Myth Breaker NTR అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు అభిమానులు. ఈ విషయమై తారక్ స్పందిస్తూ మనం కరెక్ట్ గా సినిమాలు తీసుకోలేక రాజమౌళితో చేస్తే ప్లాప్ వస్తుంది అనే అయన మీద తోసేసాం. కానీ ఎందుకో Myth Breaker అనే బాగుంది. ఆలాంటిది ఒకటి లేకున్నా బ్రేక్ చేసాడు అనే మాట నాకు ఇష్టం లేదు కానీ నచ్చింది” అని అన్నాడు ..