మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు గోపీచంద్.
Also Read : Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్
ఈ సందర్భంగా చిత్ర హీరో గోపీచంద్ నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్నసేవలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున పట్టుబట్టలు ధరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు సినీనటుడు గోపిచంద్. ఆలయ మర్యాదలతో గోపీచంద్ కు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపీచంద్. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు గోపిచంద్ కు అందజేశారు. ఈ సందర్భంగా హీరో గోపిచంద్ తో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు.