మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో “లెఫ్టినెంట్ రామ్”గా దుల్కర్ సల్మాన్ జీవన విధానాన్ని, సరిహద్దులో ఒక అమ్మాయి కోసం తపన పడే లెఫ్టినెంట్ రామ్ ను చూపిస్తుంది. విజువల్స్, దుల్కర్ లుక్, బిజిఎం చాలా బాగున్నాయి. మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో దుల్కర్ సల్మాన్ చేతిలో కాగితపు ముక్కతో సైకిల్‌పై వెనుకకు కూర్చుని కనిపిస్తాడు. సైనికులు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
Read Also : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీక్షకులకు ఇక పండగే పండగ!
ఇక దుల్కర్ సల్మాన్ మణిరత్నంతో కలిసి తమిళ సినిమా ‘ఓకే కన్మణితో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇందులో నిత్యా మీనన్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. మలయాళంలో మాత్రమే కాకుండా దాదాపు ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో మహానటి, ఉస్తాద్ హోటల్, చార్లీ, సోలో, కార్వాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన “మహానటి”లో కనిపించాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అతని రెండవ తెలుగు చిత్రం. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కిట్టిలో కురుప్, సెల్యూట్ వంటి పలు చిత్రాలు ఉన్నాయి.