Site icon NTV Telugu

My Baby : మంచి కలెక్షన్స్ రాబట్టిన మై బేబీ

My Baby

My Baby

అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించినట్టు నిర్మాతలు వెల్లడించారు. థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది.

ALso Read : HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు లైన్ క్లియర్..

ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో అధర్వ మురళి, నిమిషా సజయన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. చేతన్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మహ్మద్ జీషన్ అయ్యుబ్, రిత్విక, బోస్ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. తమిళ భాషలో జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.7 కోట్ల పైగా వసూళ్లు చేసింది. ఈ చిత్రం 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.

Exit mobile version