ఓ వైపు ‘నెపొటిజమ్’ అంటూ ఇంటర్నెట్ లో ఎంత గలాటా జరుగుతోన్నా జనాల్లో హీరోలు, వారి వారసులు అంటూ సాగే హంగామా కూడా ఆగటం లేదు. రీసెంట్ గా ఓ ఫ్యాన్ సైఫ్ అలీఖాన్ని ఒక వెరైటీ కోరిక కోరాడు. తైమూర్ తో కలసి సైఫ్ ‘బేబీస్ డే ఔట్’ హిందీ రీమేక్ చేస్తే బావుంటుందట!
హాలీవుడ్ లో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది ‘బీబేస్ డే ఔట్’. ఆ సినిమాని బాలీవుడ్ లో ఇంత వరకూ అఫీషియల్ గా రీమేక్ చేయలేదు. తైమూర్ తో కలసి సైఫ్ ‘బేబీస్ డే ఔట్’ హిందీ రీమేక్ వర్షన్ చేస్తే సూపర్ గానే ఉంటుంది. కానీ, మన హ్యాండ్సమ్ డాడీ ‘నో’ చెప్పాడు సదరు నెటిజన్ కి! ఎందుకంటే, తైమూర్ తో సినిమా షూటింగ్ అంటే ‘చాలా భారంగా’ ఉంటుందట! తైమూరే కాదు… అసలు ఏ చిన్నపిల్లలతోనైనా… షూటింగ్ చేయాలంటే అలసట వచ్చేస్తుంది. వాళ్ల మూడ్స్ అలా ఉంటాయి మరి అంటున్నాడు సైఫ్!
Read Also : ‘బిలీవ్’తో జట్టు కట్టిన ‘ఎస్.పి మ్యూజిక్’
నిజమే… ఇంకా కెమెరా, క్లాప్ అంటే ఏంటో కూడా తెలియని చిన్న పిల్లల్ని ఒప్పించి, మెప్పించి నటింపజేయటం కష్టమైన పనే. అందుకే, తైమూర్ తో సినిమాకి ‘సారీ’ చెప్పేశాడు సైఫ్ అలీ ఖాన్. చూడాలి మరి, కరీనా గారాల వారసుడు తెర మీదకి వచ్చే టైం ఎప్పటికి వస్తుందో! ప్రస్తుతానికైతే… సైఫ్ కూతురు సారా ఎంట్రీ ఇచ్చేసింది. పెద్ద కొడుకు ఇబ్రహీం కరణ్ జోహర్ కి అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టబోతున్నాడు. బెబో బేబీస్ తైమూర్ అండ్ జెహ్ బాలీవుడ్ ఎంట్రీకి ఇంకా చాలా టైమే ఉంది! ఇన్ ఫ్యాక్ట్, చాలా ఏళ్లు అని చెప్పుకోవాలి…