Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో నటవారసులు వెండితెరకు పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదో లేక సరికొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనో తెలియదు కానీ, ప్రముఖ సీనియర్ నటుడు ‘ఈటీవీ’ ప్రభాకర్ కుమార్తె దివిజ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ వైపు అడుగులేస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలుగులో ఆశించిన బ్రేక్ దక్కకముందే, ఈ తెలుగమ్మాయి నేరుగా తమిళ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దివిజ ‘వెంకట్రామయ్యగారి తాలూకా’ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయమైంది. అనంతరం ‘బ్రహ్మ ఆనందం’, ‘హే సిక్కిత’ వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా, ‘తోలు బొమ్మలు’ అనే ఓటీటీ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది.
Also Read
- #AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
- NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
- Giribabu: భయపెట్టే విలన్, నవ్వించే కమెడియన్.. గిరిబాబు జీవితంలోని ఆసక్తికర కోణాలివే!
- Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
కోలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్
ఇప్పుడు తన కెరీర్‌ను మరో మలుపు తిప్పుకుంటూ దివిజ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. గతంలో ‘రంగోలి’, ‘మద్రాస్కరన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వలీమోహన్ దాస్ రూపొందిస్తున్న కొత్త సినిమాలో దివిజ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో డీజే అరుణాచలం హీరోగా నటిస్తున్నారు. దివిజ నటిస్తున్న ఈ తమిళ చిత్రానికి సాంకేతిక నిపుణులు కూడా గట్టిగానే కుదిరారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇండియా ఫిల్మ్ కంపెనీ, శ్రీ సుమనోకర ప్రొడక్షన్, గ్రాటిట్యూడ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ వారసురాలు, తమిళ తంబీల మనసు గెలుచుకుని స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!