Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా

Ene Repeat

Ene Repeat

 టాలీవుడ్ యూత్‌లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్.. ఈ నాలుగు పాత్రలు కుర్రకారుకు ఎప్పటికీ ఫేవరెట్. ఇప్పుడు ఆ కల్ట్ గ్యాంగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమదైన బ్రాండ్ మ్యాడ్‌నెస్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ క్విర్కీ డైలాగ్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో.. సరిగ్గా అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలవుతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. గతంలో షార్ట్ ఫిల్మ్ తీయబోయి గోవాలో నానా రచ్చ చేసిన ఈ గ్యాంగ్.. ఈసారి ఏకంగా ఒక ‘వైల్డ్ సర్వైవల్ ఫిల్మ్’ తీయడానికి బయలుదేరడం ఈ సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే ఊహించని క్రేజీ సంఘటనలు, గందరగోళం, ఉత్కంఠను తరుణ్ భాస్కర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఒక ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ రైడ్‌ను థియేటర్లలో చూడబోతున్నామనే గ్యారెంటీని ట్రైలర్ ఇచ్చేసింది.

వివేక్‌గా విశ్వక్ సేన్, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉప్పుగా వెంకటేష్ కాకుమాను, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి.. ఈ నలుగురూ మళ్లీ తెరపైకి వచ్చి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు నాస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇస్తోంది. మొదటి భాగంలో వీరి మధ్య వర్కవుట్ అయిన ఫ్రెండ్‌షిప్, న్యాచురల్ కామెడీ ఈ సీక్వెల్‌లోనూ అదే స్థాయిలో పేలనున్నాయి. పాత గ్యాంగ్‌తో పాటు అనీషా ఆంబ్రోస్ ట్రైలర్‌లో తళుక్కున మెరవగా.. సీక్వెల్‌లో కథను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్ వంటి కొత్త క్యారెక్టర్లను పరిచయం చేశారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్‌గా చూస్తే.. ఏజే ఆరోన్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. క్యారెక్టర్లలోని పిచ్చితనానికి వివేక్ సాగర్ మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. నవంబర్ 19న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ కల్ట్ సీక్వెల్.. బాక్సాఫీస్ వద్ద మరోసారి నవ్వుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. YouTube video player