ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ENE రిపీట్’ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇదే ఏడాది నవంబర్ 19న ఈ మోస్ట్ అవైటెడ్ బడ్డీ కామెడీ సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అదే రోజున టోటల్ ఇండియా యూత్ అండ్ గేమ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘GTA 6’ గేమ్ కూడా విడుదలవుతుంది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి చర్చించుకుంటే బెటర్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంతేకాదు, అదే నెలలో బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ పార్ట్ 1’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో కేవలం డిజిటల్ ప్రేక్షకుల కోరిక మేరకే సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రం, ఆ గేమ్ విడుదలవుతున్న డేట్‌ను కాకుండా మరో సోలో రిలీజ్ డేట్‌తో థియేటర్స్‌లో విడుదలైతేనే, టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టగలుగుతుంది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
నిజానికి ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు అప్పట్లో మిక్స్డ్ టాక్‌తో పాటు పెద్ద కలెక్షన్స్ కూడా ఏమీ రాలేదు. అయితే, ఆ తర్వాత ఓటీటీ అండ్ టీవీల్లో చూసిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిపీట్ మోడ్‌లో ఆస్వాదించడంతో, ఇదో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ చిత్రంలో ఉన్న ఎన్నో డైలాగ్స్ అండ్ సీన్స్ కూడా సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ‘తరుణ్ భాస్కర్’కు ఏ ఫంక్షన్‌కు వెళ్లినా “ENE సీక్వెల్ ఎప్పుడు తీస్తున్నారు?” అనే ప్రశ్నే ఎదురయ్యేది. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘ఎస్ ఒరిజినల్స్’, ‘రూట్ నోడ్ సినిమా’ బ్యానర్‌పై ఈ ‘ENE రిపీట్’ను తెరకెక్కించారు. ‘వివేక్’, ‘కార్తీక్’, ‘కౌశిక్’, ‘ఉప్పి’ పాత్రల్లో… ‘కార్తీక్’ పాత్ర పోషించిన ‘సాయి సుశాంత్ రెడ్డి’ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోయినా సరే, అతని స్థానంలో ‘శ్రీనాథ్ మాగంటి’ అనే నటుడ్ని తీసుకుని మరీ, అదే ‘విశ్వక్ సేన్’, ‘అభినవ్ గోమఠం’, ‘వెంకటేష్ కాకుమాను’ స్టార్స్‌ను పెట్టి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ‘ENE రిపీట్’ను రూపొందించారు. ఇక ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ చిన్న కూతురు ‘శివాత్మిక’ సైతం ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, పార్ట్ 1కు ట్యూన్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ‘వివేక్ సాగర్’నే ఈ సీక్వెల్‌కి కూడా వర్క్ చేస్తున్నారు.
Also Read
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!