ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
Also Read : Samantha: నిర్మాత, హీరోయిన్గా సినిమా ఫైనల్ చేసిన సమంత?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మీ ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ఈ యాప్‌లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతోంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది.
