మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
Also Read : OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
ఈ సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల మార్క్ ను అందుకున్నాడు దుల్కర్. కాగా ఈ సినిమాతో అటు కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా మరో అరుదైన ఘనత సాధించాడు దుల్కర్. అదేమంటే లక్కీ భాస్కర్ రెండు రోజుల క్రితం ఓటీటీ రిలీజ్ అయింది. కానీ ఇప్పటికి బుక్ మై షో టికెట్ సేల్స్ లో ట్రేండింగ్ అవుతుంది. ప్రతి రోజు మినిమం 7K టికెట్స్ బుక్ అవుతుంది. డిజిటల్ రిలీజ్ అయిన కూడా బుక్ మై షో లో ఈ రేంజ్ బుకింగ్స్ అంటే చాలా అరుదైన ఘనతగా ట్రేడ్ పేర్కొంటుంది. ఇంకో విశేషం ఏంటంటే ఓటీటీ రిలీజ్ అయ్యాక కఅరుదైన ఘనత సాధించిన లక్కీ భాస్కర్..లెక్షన్స్ మరింత పెరగడం ఆశ్చర్య పరుస్తోంది. ఇదిలా ఉండగా మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం లైఫ్ టైమ్ బుకింగ్స్ ను రేపటితో లక్కీ భాస్కర్ దాటనుంది. ప్రస్తుతం 5వ వారంలోకి లక్కీ భాస్కర్ సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాడు.