మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.
Also Read:Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!
గీత ఆర్ట్స్ తో కలిపి స్వప్న సినిమాస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. అయితే ఈ సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా వస్తోందని టీం చెబుతోంది ఇప్పటికే సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి వంటి వరుస హిట్లతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో మరింత దగ్గరవుతాడని టీం చెబుతోంది. అంతేకాదు ఇప్పటివరకు ఆయన మలయాళ నుంచి వచ్చిన ఒక మలయాళ హీరోగానే అందరూ భావిస్తూ వచ్చారు.
Also Read:Mega Anil: నయనతార ‘ఇలాకా’లో మెగాస్టార్?
ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరో అనేలా ఆయనకు ఇమేజ్ ఏర్పడుతుందని కూడా చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక ఎన్నారై సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తోంది. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు కలిసి సినిమా చేస్తున్నాయంటేనే ఒకరకంగా సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. అలాంటిది దుల్కర్ సల్మాన్ కి కెరీర్లో నిలిచిపోయే పాత్ర అవుతుందని అనడంతో సినిమా మీద మరింత ఆసక్తి ఏర్పడుతోంది.