OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Release: మొదటి ఆటకే బోల్తా పడి, ఆ తర్వాత థియేటర్లలో రచ్చ లేపిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా అరుదు. రీసెంట్గా తమిళంలో వచ్చిన ‘డోరోతి’ సరిగ్గా ఇలాంటి అద్భుతమే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై మొదటి రోజు అంతా పెదవి విరిచారు. కానీ కథలోని మలుపులు, కీర్తి నటన నెమ్మదిగా జనాలకు ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.
ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ మొదలయ్యాక థియేటర్ల దగ్గర జనాలు ఎగబడ్డారు. చూస్తుండగానే కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలా థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం, ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఓటీటీలోకి దిగిపోయి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్సయిన వాళ్లతో పాటు మంచి మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఈ వీకెండ్‌కు ఇది పక్కా ఎంటర్టైనర్.
Also Read
డోరతీ కథ
తమిళనాడులోని ఓ పల్లెటూరి వాతావరణంలో సాగే కథ ఇది. సుబ్బు (సనంత్), కార్తీ (రిషికాంత్) ప్రాణ స్నేహితులు. సుబ్బు చిన్నతనంలోనే తల్లి, అక్క చనిపోవడంతో ఆ ఇంట్లో స్త్రీల నీడే ఉండదు. పైగా అతని తండ్రి వీరయ్యకు పరువు, కులం, మగతనం అంటే పిచ్చి. ఆడవాళ్ల ఆనవాలు లేని ఆ ఇంట్లో పెరిగిన సుబ్బు, చిన్నప్పటి నుంచి గొడవలకు పోతూ రఫ్‌గా కనిపిస్తున్నప్పటికీ, తనలోని స్త్రీ స్వభావాన్ని సమాజం గుర్తించకుండా జాగ్రత్తపడతాడు. ఓ దశలో సుబ్బు అన్నయ్య డోరతీ (కీర్తి సురేశ్) అనే కేరళ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆమె రాకతో ఇంట్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. సుబ్బు ఆమెతో ఎంతో సన్నిహితంగా ఉంటాడు కానీ అనూహ్యంగా డోరతీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. పరువు పోతుందన్న భయంతో వీరయ్య దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు ముగించేస్తాడు. అయితే తన తండ్రి, అన్నయ్యే ఆమెను చంపేశారని సుబ్బు భావిస్తాడు. మరోవైపు సుబ్బు కోసం కార్తీ ఓ హత్య చేయాల్సి వస్తుంది. ఒకపక్క కుటుంబ అకృత్యాలు, మరోపక్క తనలో రగులుతున్న స్త్రీ పురుష కాన్ఫ్లిక్ట్ తట్టుకోలేక తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని సుబ్బు బయటపెట్టి ఇల్లు వదిలి పారిపోతాడు. పరువు కోసం కన్న కొడుకుని కూడా చంపాలని చూసే తండ్రి నుంచి సుబ్బు తప్పించుకున్నాడా? అసలు డోరతీ మరణానికి గల కారణమేంటి? ప్రాణ స్నేహితుడు సుబ్బులోని ఈ మార్పును కార్తీ ఎలా స్వీకరించాడు? అనేదే మిగిలిన కథ.
తాజావార్తలు
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!