Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల విడుదలైన 418 ప్రమోషనల్ వీడియోలో వీరిద్దరితో పాటు దర్శకుడు కీర్తన్ నాదగౌడ కూడా సందడి చేశారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్న వీడియోను రూపొందించింది. అయితే సినిమా ప్రమోషన్ కంటే కూడా, ప్రభాస్ చేసిన సెన్సేషనల్ కామెంట్లే ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కీర్తన్ తెరకెక్కించిన ‘418’ పోస్టర్లు, కీహోల్ కాన్సెప్ట్‌ను గమనించిన ప్రభాస్.. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఎందుకు సమర్పిస్తున్నారో సరదాగా ఆరా తీశారు. ప్రశాంత్ సినిమాల్లాగే ఇది కూడా డార్క్ థీమ్‌తో ఉండటం వల్లేనా అని ప్రభాస్ ప్రశ్నించగా, ప్రశాంత్ నీల్ నవ్వుతూ “మళ్లీ ఇది కూడా ‘రాధేశ్యామ్’ లాగా కలర్ఫుల్గా తీస్తే బాగోదు కదా” అంటూ చమత్కరించారు.
దానికి ప్రభాస్ గట్టిగా నవ్వుతూ, “అబ్బో.. గట్టి పంచే పడిందిగా! ‘సలార్ 2’ షూటింగ్లో నీ సంగతి చెప్తా” అంటూ నవ్వుల పువ్వులు పూయించారు. ఒక స్టార్ హీరో తన ప్లాప్ సినిమాను ఇంత ఓపెన్‌గా ప్రస్తావించడం, దర్శకుడితో కలిసి సరదాగా ట్రోల్ చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సరదా సంభాషణ తర్వాత ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో ప్రభాస్ “నా గిఫ్ట్ ఎక్కడ?” అని అడగ్గా, నీల్ “సలార్ 2 ఎప్పుడు మొదలుపెడుతున్నామో అదే గిఫ్ట్” అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్ 2’ వచ్చే ఏడాది జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రశాంత్ నీల్ స్వయంగా స్పష్టం చేయడంతో ప్రభాస్ “ఈ విషయం జనాలకు గట్టిగా చెప్పు” అంటూ అభిమానులకు అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.
Also Read
- JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
- Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
- Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
- Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
దర్శకుడు కీర్తన్ నాదగౌడ మాట్లాడుతూ.. ‘418’ అనేది ఎటువంటి కామెడీ లేదా రొమాన్స్ లేకుండా, ప్రేక్షకులను భయపెట్టే స్వచ్ఛమైన ‘స్ట్రిక్ట్లీ హారర్’ చిత్రమని పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త భయాందోళనలను పరిచయం చేయనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు, ‘సలార్ 2’ గురించిన అప్డేట్తో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
-
Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!