యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న తండేల్ పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Also Read : Dil Raju : ఐటీ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్ రాజు .
కాగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో తండేల్ గురించి ఒకటే చర్చ నడుస్తోంది. తండేల్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా హయ్యర్లు కానీ మినిమమ్ గ్యారంటీలి కానీ కింద పట్టణాలు, థియేటర్ల లెక్కన ఎగ్జిబిటర్లకు ఇవ్వవద్దని నిర్మాతల ఆదేశాలు జారీ చేశారట. సినిమా బాగా ఆడుతుందని, అందువల్ల ఆదాయం లిమిట్ చేసుకోవద్దని సూచించారట నిర్మాతలు. వాస్తవంగా అయితే సంక్రాంతి సినిమాలు తర్వాత మరే ఇతర సినిమాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాని ఎగ్జిబిటర్లు తండేల్ ను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. నాగ చైతన్య, పల్లవి జోడి క్రేజ్ తో పాటు రియల్ స్టోరీ కావడం, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే బిజినెస్ సర్కిల్స్ కాస్త ఆరాలుతీయడం సహజమే. నిర్మాతల నిర్ణయంతో అన్ని ఏరియలలో రెంట్ బేసిస్ మీదా రిలీజ్ అవుతోంది తండేల్.