స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
Also Read : Mirai : మిరాయ్ లో ‘రాముడు’గా టాలీవుడ్ స్టార్ హీరో
ఈ సినిమలో తన పాత్ర కోసం సరికొత్తలుక్ లో కనిపించేందుకు సిద్ధూ జొన్నలగడ్డ లుక్ ఛేంజ్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న తెలుసు కదా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ నెల 11 తారీకున ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. జాక్ డిజాస్టర్ తో డీలా పడిన సిద్దూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాతో హిట్ కొట్టి మార్కెట్ ని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు సిద్దు. అందుకు తగ్గట్టే సినిమా కూడా బాగా వస్తున్నాట్టు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. సిద్దు హిట్ కొడతాడని టాక్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజ్ అయినా మల్లిక గంధ ఫస్ట్ లిరికల్ సాంగ్ కు చాట్ బస్టర్ గా నిలిచింది. నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యహరిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ కానుంది.