గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అదే ధైర్యంతో ఈసారి తెలుగులో నేరుగా మూడు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో ఏ సినిమా యూనివర్సల్ హిట్ టాక్ సంపాదించలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే, తమిళం నుంచి డబ్బింగ్ అయి వచ్చిన ‘డ్యూడ్’ మొదటి స్థానంలో ఉండగా, కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ సినిమా తర్వాతి స్థానంలో ఉంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీపావళికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల కంటే, ఎప్పుడో అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘కాంతార చాప్టర్ 1’ డామినేషన్ చూపిస్తోంది.
Also Read:Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర
నిజానికి, ఆదివారం నాడు బుక్ అయిన టికెట్ ట్రెండ్స్‌ని బట్టి చూస్తే, ఆదివారం ‘కాంతార చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా 347.49K టికెట్స్ బుక్ అవ్వగా, ‘డ్యూడ్’ సినిమాకి 210.66K బుక్ అయ్యాయి. ఇక కిరణ్ అబ్బవరం సినిమాకి 65.18K టికెట్లు బుక్ అవ్వగా, ‘తెలుసు కదా’ సినిమాకి 25.67K టికెట్లు బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే, సుమారు 20 రోజుల క్రితం రిలీజ్ అయిన ‘కాంతార’ మీద ప్రేక్షకులు ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారు అనేది సుస్పష్టం. ఇక ఈ దెబ్బతో ‘కాంతార’ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం కేక్ వాక్ అనే ప్రచారం జరుగుతోంది.