DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను

Divyednhu

Divyednhu

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నా భయ్యా’గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ. తనదైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లోను అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంతో దివ్యేందు శర్మ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 4న  విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ‘తెలుగు రాష్ట్రాల్లో ‘మీర్జాపూర్’ సిరీస్‌కు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుందని నేను ఊహించలేదు, తెలుగు ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ సమయంలో నాకు తెలుగు రాకపోవడంతో కొంత సిగ్గుగా అనిపించింది. అందుకే నెమ్మదిగా తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు వస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను’  అని చెప్పుకొచ్చారు. అలాగే మొదటి సినిమా విడుదల కాకముందే దివ్యేందు శర్మ తన రెండో తెలుగు ప్రాజెక్టును కూడా లాక్ చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోను మున్నా భయ్యా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుసగా స్టార్ హీరోలు మరియు టాప్ దర్శకులతో పని చేసే అవకాశం రావడం పట్ల దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.