టాలీవుడ్ ఫస్ట్ మూవీ లోఫర్ నుండే అందాలు ఆరబోస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటానీ. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ లో లాక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యింది. ధోనీ, భాఘీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చూడాల్సిన అవసరం రాలేదు దిశాకు. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ చూసింది మేడమ్.
Also Read : NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్
రాధతో మొదలైన ప్లాప్స్ ఏక్ విలన్ రిటర్స్న్, యోధ వరకు కంటిన్యూ అయ్యాయి. ఇక అదే టైంలో చాలా రోజుల తర్వాత తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన కల్కి2898ఏడీలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఎట్టకేలకు టాలీవుడ్‌లో కంబ్యాక్ హిట్ కొట్టాను అటు బాలీవుడ్ బ్యూటీగా ఓ హిట్ అందుకున్నాను అనుకునే లోపు సూర్య తో చేసిన కంగువాతో భారీ డిజాస్టర్ చూసింది. సౌత్‌పై హోప్స్ పెట్టుకుంటే దిశాకు ఖంగుతినిపించి కంగువా రిజల్ట్. ప్రజెంట్ దిశా చేతిలో వెల్కమ్ టు ద జంగిల్ మాత్రమే ఉంది. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. గత ఏడాది రిలీజ్ చేయాలనుకుంటే ఈ ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది. కానీ ఎప్పుడోస్తుందో క్లారిటీ లేదు. ఇదే కాకుండా సిద్దాంత్ చతుర్వేదితో మూవీ అంటూ వార్తలొచ్చాయి. ఆ సినిమా ఉందో లేదో కూడా తెలియదు. గ్లామర్ అండ్ ఎక్స్ పోజింగ్ నో చెప్పకపోయినా దిశాకు ఆఫర్లు రావట్లేదు. గ్లామర్ తో పాటు యాక్టింగ్ కూడా ఉండాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.