కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లవుతున్నా దిశా పటానీకి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ రోల్స్‌కు నో అనదు.. ఎక్స్ పోజింగ్‌కు అస్సలు అడ్డు చెప్పదు.. కానీ ఆఫర్లు చూస్తే అంతంత మాత్రమే. లోఫర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ డాల్ రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తక్కువ టైంలోనే ఓకే అనిపించుకుంది. ధోనీ, భాఘీ2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది కానీ, బాఘీ2 మినహా మిగిలిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్సే.
Also Read :Constable: కానిస్టేబుల్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్
మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ చూసింది దిశా. ఈ ప్లాప్‌ల పరంపర ఏక్ విలన్ రిటర్స్న్, యోధ వరకు కంటిన్యూ అయ్యాయి. అదే టైంలో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం టాలీవుడ్‌కి వచ్చి కల్కితో హిట్ కొడితే, ఆ ఆనందాన్ని మిగల్చకుండా చేసింది కంగువా. ఈ దెబ్బకు ఇప్పటి వరకు ఆమె స్క్రీన్ పై కనిపించిందే లేదు. మళ్లీ బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసినా.. ఛాన్సులు కూడా పెద్దగా రావడం లేదు. వచ్చినా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లకు పరిమితమౌతోంది. వెల్కమ్ టుది జంగిల్లో పేరుకు ఆమె హీరోయిన్. ప్రజెంట్ హాలీవుడ్ ఫిల్మ్ హోలీ గార్డ్ సాగాలో నటిస్తోంది.
Also Read :Chiranjeevi – Vijay Sethupathi: మెగాస్టార్ తో పూరీ- సేతుపతి
వెల్కమ్ టుది జంగిల్, హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్‌కి రెడీ అయినా… థియేటర్లలోకి ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఏం సందడి చేస్తామనుకుందో ఏమో… రిస్క్ చేసి మరీ ఓ ప్లాప్ మూవీ సీక్వెల్ కు సైన్ చేసిందట. 2007లో ఇమ్రాన్ హష్మీ, శ్రియా జంటగా నటించిన ఆవారాపన్ అప్పట్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాను కల్ట్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో దిశాను మెయిన్ లీడ్ కింద తీసుకుంటున్నట్లు టాక్. కిసెస్ కింగ్ సరసన ఈ గ్లామరస్ గర్ల్ నటించబోతుందన్నది లెటెస్ట్ న్యూస్. ప్లాప్ మూవీకి సీక్వెల్ చేయడం మ్యాడ్ అంటే.. అలాంటి సినిమాకు మేడమ్ సైన్ చేయడమంటే.. మ్యాడ్ నెస్ ఓవర్ లోడనేగా అర్థం. ఆఫర్లు రావట్లేదని ఇలాంటి డెసిషన్స్ తీసుకుందా…? ఏమో…