Director Karuna Kumar new movie is kalapuram
‘పలాస, శ్రీదేవి సోడాసెంటర్’ వంటి సీరియస్ కథలతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణకుమార్ తన తదుపరి చిత్రంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ‘కళాపురం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్ టైన్మెంట్స్ కలసి నిర్మించాయి. ఇక్కడ అందరూ కళాకారులే అన్నది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇదో మధ్యతరగతి మనుషుల కథ. కళాపురం అనే ఊరిలో ఉండే కళాకారుల కథ. ప్రజెంట్ సినేరియో మీద సెటైరికల్ సినేరియోగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ కరీంనగర్ కి దగ్గరలోని ధర్మపురి అనే ఊరిలో 42 రోజుల పాటు జరిపామని, ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నామని అంటున్నారు దర్శకుడు కరుణకుమార్. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. పూర్తిస్థాయిలో హాస్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం పెద్ద ఎస్సెట్ అంటున్నారు. సత్యం రాజేశ్, సంచిత, ఆషిమ, పైమా, జబర్ దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, రుద్ర, ఆంటోని ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారులు.