Devi Movie : ‘దేవి’లో పాము కాటుకు వ్యక్తి బలి.. షాకింగ్ విషయం బయటపెట్టిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసి తరువాత కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు దేవీ ప్రసాద్. ఇప్పుడు నటుడిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు ఆయన. ‘కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చి సూపర్‌హిట్టయిన “దేవి” సినిమాలో పాముది ప్రాధాన పాత్ర. షూట్లో వాడేపాములన్నీ విషం తీసేసిన పాములే. నాగదేవత భక్తురాలైన “వనిత”పుట్టలో పాలు పోసి పాట పాడితే పాము వచ్చి ఆమెకు బొట్టు పెట్టే సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి షాట్ తీసేటప్పుడు పాముకి మూతి కుట్టేస్తుంటారు. కానీ వనిత ధైర్యంగా “నాకేం భయంలేదు పాముకి నోరు కుట్టొద్దు” అనటంతో కుట్టలేదు. ఫ్రేం ఔట్లో వుండి పడగవిప్పివున్న పాముని పట్టుకున్న పాములతను ఓ భాయ్. క్లోజ్‌షాట్‌లో నమస్కారం పెడుతున్న వనిత నుదుటికి పాముని ఆనించాలి. అక్కడివరకూ వచ్చిన పాము ఛక్‌మని ఆమె వ్రేలుని గట్టిగా పట్టేసుకోవటంతో అందరూ షాక్. ఒక నిమిషం తరువాత అది వొదిలేసినా రక్తం ధారగా కారిపోవటంతో కంగారుగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. పాముకి విషం లేనందున, అమ్మాయి ధైర్యంగా ఉన్నందువల్లా ఏమీ కాలేదని ఇంజక్షన్స్ ఏవో చేసి పంపించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాం.
Mangli: అంతా విష ప్రచారం.. ‘బాబు’ని నేనేం అనలేదు.. ప్రమాణం చేసి చెబుతున్నా!
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
మద్రాస్ లో తరతరాలుగా షూటింగ్స్‌కి కావలసిన పాములను తీసుకొచ్చేది సదరు “భాయ్” కుటుంబమే. అతనితో పాటు అతని అసిస్టెంట్‌గా ఓ 19 ఏళ్ళ బక్కపలుచని కుర్రాడొచ్చేవాడు”దేవి”షూటింగ్‌కి. ఎంతో హుషారుగా వుంటూ యూనిట్ అందరికీ ఇష్టుడైపోయాడు. వాడి అసలుపేరేంటో గానీ డైరెక్టర్ “మణి” అనిపిలుస్తూ వాడిమీద జోకులేస్తూవుండేవారు. ఈ క్రమంలో ఓ షెడ్యూల్ వైజాగ్‌లో ప్లాన్ చేశాం. “భాయ్” కి మరో షూటింగ్ ఉండటంతో ఆ షెడ్యూల్‌కి భాయ్ లేకుండా “మణి”మాత్రమే పాములు తీసుకొచ్చాడు. చిన్నకుర్రాడివి నువ్వేంచెయ్యగలవురా అంటే మీకెలా షాట్ కావాలో చెప్పండి సార్ అదరగొడతా అన్నట్లుగా మాట్లాడాడు. ఓ రాత్రి 8 గంటలకు మేడ మీది గదిలో భానుచందర్, వనిత పడుకునివుంటే పాము బెడ్‌పైకెక్కి విలన్ పంపిన విషవాయువుని పీల్చేసే సీన్ తీస్తున్నాం. బుట్టలోనుండి తీసిన రెండుమూడు పాములతో ఆ షాట్ తీయడానికి ప్రయత్నించినా లైట్స్ వేడికి ఒక్క పామూ నిలబడలేక వాలిపోతుంది. పౌరుషం వచ్చిన “మణి” గుడ్డసంచిలోవున్న మరోపాముని బయటికి తీశాడు. బుస్సున పడగవిప్పింది. అదెంతకోపంగా వుందంటే వాడిచేతిమీద నాలుగైదుసార్లు పడగతోకొట్టింది. చేతి మీద రక్తపు బొట్లు కనిపించటంతో అందరూ ఖంగారుపడుతుంటే “ఇవన్నీ మాకు మామూలే సార్.వనిత గారి ఇన్సిడెంట్ చూశారు కదా ఎందుకు భయపడతారు” అంటూ బెడ్ మీద పెట్టాడు పాముని. షాట్ అయిపోయాక బుట్టలుతీసుకుని కిందికి వెళ్ళిపోయాడు మణి.
కొంతసేపయ్యాక ఏదోపనిమీద నేను క్రింది ఫ్లోర్‌కి వెళితే “మణి” వాంతి చేసుకోవటానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. చెయ్యిచూస్తే వాచివుంది. వాడు నవ్వుతూనే ఉన్నా నా మనసు ఏదో కీడు శంకించింది. వాడు వొద్దంటున్నా బలవంతంగా మేనేజర్ మురళితో హాస్పిటల్‌కి పంపించాము. రాత్రి 11గంటలకు హోటల్ రూంలో భోజనానికి కూర్చుంటుంటే బెల్ మ్రోగింది. డోర్ ఓపెన్ చేయగానే మేనేజర్ మురళి గారు “మణి”గాడు చనిపోయాడు సార్ అంటూ ఏడుస్తున్నాడు. కాళ్ళకింద భూమి కదిలిపోయింది. మద్రాసు “భాయ్” కి ఫోన్ చేసి చెబితే అతను భోరుమంటూ…అది కొత్త పాము సర్. కొత్తగా పట్టి విషం తీసిన పాముని 4 నెలలు గుడ్డ సంచిలో పెట్టి ఆ తరువాతే షూటింగ్స్‌లో వాడుతాము అప్పుడే దానిలో విషం పూర్తిగా పోతుంది. మణికి ఆ విషయం తెలియక ఆ పాముని తెచ్చాడు అన్నాడు. దానికంటే మాకు విస్మయం కలిగించిన అంశం “మణి”ఐదేళ్ళక్రితం భోజనం లేక ఏ.వీ.యం.స్టూడియో పరిసరాల్లో తిరుగుతుంటే జాలి పడి చేర దీశాం. వాడి ఊరేదో తల్లితండ్రులెవరో కూడా మాకు తెలియదు. వాడి సామానంతా వెతికినా ఒక్క క్లూ అయినా దొరకలేదు” అని చెప్పాడు భాయ్. ఏ తల్లి కన్నబిడ్డో…. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వైజాగ్ మట్టిలో కలిసిపోయాడు మణి’ అంటూ అప్పటి సంగతి చెప్పుకొచ్చారు దేవీ ప్రసాద్.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!