గతంలో కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసి తరువాత కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు దేవీ ప్రసాద్. ఇప్పుడు నటుడిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు ఆయన. ‘కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చి సూపర్‌హిట్టయిన “దేవి” సినిమాలో పాముది ప్రాధాన పాత్ర. షూట్‌లో వాడేపాములన్నీ విషం తీసేసిన పాములే. నాగదేవత భక్తురాలైన “వనిత”పుట్టలో పాలు పోసి పాట పాడితే పాము వచ్చి ఆమెకు బొట్టు పెట్టే…